Mobile Popup Ad
Mobile Popup Ad

నర్సాపూర్‌లో శిశువు మరణం.. ఆసుపత్రి ఎదుట ఆందోళన

కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా (Medak District) నర్సాపూర్ (Narsapur) పట్టణంలోని అమ్మ ఆసుపత్రి వద్ద శిశువు మృతి ఘటనపై బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జక్కపల్లి గ్రామానికి చెందిన 9 నెలల చిన్నారి మణివర్ధన్‌కు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు రక్త కణాలు తగ్గాయని తెలిపి చికిత్స అందించారు.

పరిస్థితి విషమించడంతో చిన్నారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లగానే శిశువు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అమ్మ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>