వెల్దుర్తి మండలంలో వడ్ల కొనుగోలు ఆలస్యంపై రైతుల ఆందోళన

కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా వెల్దుర్తి (Veldurthy) మండలంలోని మనేవారి జలాల్‌పూర్ వరి సేకరణ కేంద్రంలో వడ్ల కొనుగోళ్లలో (Paddy Procurement) తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రంలో ధాన్యం గుట్టలుగా పేరుకుపోయింది. కొనుగోలు ఆలస్యం కావడంతో అకాల వర్షాల భయంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితిపై రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్య పెరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని రైతులు, మహిళలు నినాదాలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>