Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందిరమ్మ బీమా స్కీమ్ పై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’  (Indiramma Bima) పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ ఈ స్కీమ్ విధివిధానాలపై చర్చించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతీ ఇంటిని టచ్ చేయాలని, సర్వేలో వివరాలను సేకరించాలని సబ్ కమిటీ నిర్ణయించింది.

సర్వే టైమ్‌లో ఏదేని పరిస్థితుల్లో కుటుంబం అందుబాటులో లేని కారణంగా వివరాలు అందకపోతే ప్రత్యేకంగా క్యాంపులు పెట్టి డేటా తీసుకోవాలని సమావేశం డెసిషన్ తీసుకున్నది. సర్వే పూర్తయిన ఇండ్లను గుర్తించేందుకు వీలుగా స్టిక్కర్లను అంటించాలని భావించింది. ఈ పథకం ద్వారా కలిగే లబ్ధి, మొత్తం కుటుంబానికి కలిగే ప్రయోజనాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అవగాహన కలిగించాలని సమావేశం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీజీపీ సీవీ ఆనంద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, వికాస్‌రాజ్, నవీన్ మిట్టల్, వాణీప్రసాద్, దాన కిషోర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు సందీప్ కుమార్ సుల్తానియా, గౌరవ్ ఉప్పల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

జూన్ 2 నుంచి ప్రగతి ప్రణాళిక ముగింపు వేడుకలు :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం విజయవంతం కావడంతో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. జూన్ 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. ఈ సమావేశంలో గ్రామసభ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించింది. రాబోయే 12 రోజుల్లో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నది. పర్యావరణం – ఆరోగ్యం; రోడ్డు భద్రతపై అవగాహన; మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వ్యతిరేక ప్రచారం; మహిళా శిశు రక్షణకు ప్రాధాన్యత; గృహ నిర్మాణం, పర్యాటక ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి రంగాల్లో ప్రగతి; సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుల అభివృద్ధికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తదితరాల నిర్దిష్ట షెడ్యూలుపై ఈ సమావేశం చర్చించింది. అన్ని ప్రభుత్వ శాఖలు లోపాల్లేకుండా సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>