కలం, బిజినెస్ బ్యూరో: ఇన్నేండ్లలో ఎన్నడూ లేనంత ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి (Indian Rupee) విలువ పడిపోయింది. సెంచరీ మార్క్‌కు చేరువలో ఉంది. మోదీ సర్కార్ కొలువు దీరినప్పటి నుంచి క్రమంగా రూపాయి విలువ పడిపోతూనే ఉంది. 2014లో 60 మార్క్ దగ్గర ఉన్న దేశ కరెన్సీ.. ఇప్పుడు ఏకంగా 95 మార్క్‌ను టచ్ చేసింది. ఈ ప్రభావం ఇప్పటికే మార్కెట్లో పప్పు, ఉప్పు, నూనె నుంచి మొదలు.. నెలవారీ జీతంపైనా పడుతున్నది. బయట ఏది కొందామన్నా భగ్గుమంటున్నది. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇరాన్ వార్ ఎఫెక్ట్‌తో గ్యాస్, పెట్రోల్ కొరత వల్ల తిప్పలు పడుతున్న సగటు జీవికి.. రూపాయి విలువ పడిపోవడం మరింత కష్టాలను తెచ్చిపెట్టనుందా? ద్రవ్యోల్బణం మరింత పెరిగి ఇండియన్ ఎకానమీ డిస్ట్రబ్ కానుందా?! ఈ పతనం ఎటువైపు దారి తీయనుంది..! రూపాయి ఇలా పడటానికి కారణాలు ఏమిటి? వీటన్నింటిపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: హర్మూజ్ నుంచి మలక్కా వరకు.. ప్రధాన జలసంధులు ఇవే!
Follow Us On: X(Twitter)

