అరుణాచల్‌లో హెలికాప్టర్లతో వాయుసేన‌ భారీ ఆపరేషన్

క‌లం, వెబ్ డెస్క్‌: అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని పాసీఘాట్ సమీపంలో ఉన్న మేబో, సిగర్ అటవీ ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు అడవిని దహిస్తూ సమీపంలోని జనవాసాలకు కూడా ముప్పుగా మారడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) రంగంలోకి దిగింది. మంటలను అదుపు చేయడానికి ఐఏఎఫ్‌కు చెందిన శక్తివంతమైన ఎంఐ 17 వీ5 హెలికాప్టర్‌ను వినియోగించారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట హెలికాప్టర్ ద్వారా ప‌లుమార్లు గాలిలో నుంచి నీటిని చల్లారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం సుమారు 66,000 లీటర్ల నీటిని వినియోగించారు. వాయుసేన సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల అడవి పక్కనే ఉన్న ఊర్లకు మంటలు వ్యాపించ‌కుండా అరికట్టగలిగారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎయిర్ ఫోర్స్ ప‌ని తీరును రక్షణ శాఖ ప్రశంసించింది.

Read Also: కృత్రిమ కొరతకు అడ్డుకట్ట: కేంద్రం కీలక నిర్ణయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>