చివరి ఓవర్ థ్రిల్లర్‌లో భారత్ విజయం

కలం, స్పోర్ట్స్​ : సానో వేదికగా జపాన్‌తో జరిగిన తొలి చారిత్రాత్మక T20 మ్యాచ్‌ (India vs Japan) లో భారత జట్టు 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జపాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డారు.ఓపెనర్ అభిషేక్ శర్మ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. సంజూ శామ్సన్ 9 పరుగులు, ఇషాన్ కిషన్ 3 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు చేయడంతో, భారత్ నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు సాధించింది.

జపాన్ బౌలర్ చార్లీ హారా-హింజే 2 వికెట్లు తీశాడు. 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చింది. జపాన్ ఓపెనర్లు వేగంగా పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. అయితే లచ్లాన్ యమమోటో-లేక్‌ను ఇషాన్ కిషన్ రనౌట్ చేయడంతో జపాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వరుసగా వికెట్లు తీసి జపాన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయినప్పటికీ జపాన్ బ్యాటర్లు చివరి వరకు పోరాడారు. ఆఖరి ఓవర్‌లో జపాన్ గెలుపునకు 8 పరుగులు అవసరం కాగా, భారత్ వారిని కట్టడి చేసింది. దీంతో జపాన్ జట్టు 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>