అధికారమే లక్ష్యంగా మోర్చాల ప్రతినిధులు కృషి చేయాలి: రాంనాథ్

కలం, నిర్మల్: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మోర్చాల ప్రతినిధులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ (Ravula Ramnath) అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా బీజేపీ (Nirmal BJP) కార్యాలయంలో ఇటీవల నియమితులైన ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, కిసాన్ మోర్చాల నాయకులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజా ఉద్యమాలు చేపట్టి, ప్రజల తరఫున పోరాడాలని కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బడి పోతన్న, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పండిత్ జాదవ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాదు ప్రభాకర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, ఆయా మండలాల బీజేపీ అధ్యక్షులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>