Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్‌పై సుంకాల‌పై వైట్ హౌస్ కీల‌క‌ ప్రకటన

క‌లం, వెబ్ డెస్క్‌: భారత్‌–అమెరికా(India-US) మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన రూపురేఖలు ఖరారయ్యాయని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ ప్రకటనను అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి వచ్చే అన్ని పారిశ్రామిక ఉత్పత్తులు, అలాగే విస్తృత శ్రేణిలో ఉన్న ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ సుంకాలను పూర్తిగా తొలగించనుంది. కొన్ని సుంకాల‌ను గణనీయంగా తగ్గించనుంది. భారత్‌–అమెరికా మధ్య దాదాపు ఏడాది కాలంగా సాగిన వాణిజ్య చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీనికి కొన్ని రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందానికి వచ్చాయని ప్రకటించారు. ఈ విషయాన్ని భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోడీ(Narendra Modi) కూడా ధృవీకరించారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికాకు ఎగుమతి చేసే భారత ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు 18 శాతానికి తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే భార‌త్‌పై విధించిన అద‌న‌పు 25 శాతం సుంకాన్ని అమెరికా ఎత్తివేసింది.  ఈ తాత్కాలిక ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>