కలం, వెబ్ డెస్క్ : సింగరేణిని సీఎం రేవంత్ రెడ్డి స్కామ్ లకు నిలయంగా మార్చారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మున్సిపాటీలోని క్యాతనపల్లిలో నిర్వహించిన మున్సిపల్ ప్రచారంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మనం జాగ్రత్త పడకుంటే ఐదారేండ్లలో సింగరేణిని పూర్తిగా దోచుకుంటారని హెచ్చరించారు. సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కాదు.. తెలంగాణ ప్రజలే సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి డైవర్డ్ చేస్తారని ఆయన (Harish Rao) తెలిపారు.
సింగరేణిలో జరిగిన స్కామ్ లో మంత్రి వివేక్ వెంకట స్వామికి వాటా ఉందా అని ప్రశ్నిస్తే మౌనంగా ఎందుకుంటున్నారని నిలదీశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని హరీశ్ రావు జోస్యం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి సీఎం రేవంత్ రెడ్డిని చీరి చింతకు కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. కారుకు ఓటు గుద్దుతే రేవంత్ గూబ గుయ్యిమనాలన్నారు. చెన్నూరులో కాంగ్రెస్ పై పోరులో పొత్తు పెట్టుకున్న సీపీఐకి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.


