Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్‌కు భారీ రిలీఫ్.. చమురు సంక్షోభానికి చెక్

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు (Crude Oil) సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. చమురు సంక్షోభం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత్‌కు రష్యా (Russia) గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల ఏప్రిల్‌లో దాదాపు 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి భారతీయ రిఫైనరీ సంస్థలు సిద్ధమయ్యాయి. హోర్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో సౌదీ అరేబియా, ఇరాక్ లాంటి దేశాల నుంచి సరఫరా తగ్గడంతో భారత్ తిరిగి రష్యా వైపు మొగ్గు చూపింది.

అమెరికా మంజూరు చేసిన తాత్కాలిక మినహాయింపులతో రష్యా నుంచి చమురు దిగుమతి కానుంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో చమురుకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో, భారత్ ఈ చమురును క్రూడ్ ధర కంటే బ్యారెల్‌కు 5 నుంచి 15 డాలర్ల అదనపు ప్రీమియం చెల్లించి మరీ కొనుగోలు చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>