కలం, వెబ్‌డెస్క్: దాయాదుల పోరులో భారత బౌలర్లు అదరగొడుతున్నారు (India – Pakistan). బ్యాటర్లు ఊసురోమనిపించినా బౌలర్లు మాత్రం భారతీయుడి దెబ్బేంటో చూపిస్తున్నారు. తొలి ఓవర్ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సున్నా పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. సాహిబ్‌జాదాను క్యాచ్ ఔట్ చేశాడు. అతడి క్యాచ్‌ను రింకూ సింగ్ క్లీన్‌గా పట్టాడు. రెండో ఓవర్ కోసం బాల్ తీసుకున్న బుమ్రా.. తొలి బంతికే సిక్స్ ఇచ్చాడు. కానీ రెండో బాల్‌కే సయమ్ అయుబ్‌ను ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. దీంతో పాకిస్థాన్‌పై తొలి ఓవర్ నుంచే ఒత్తిడి పెరుగుతోంది.
ఒకవైపు కొద్దోగొప్పో పరుగులు అందుతున్నా.. వికెట్లు కాపాడుకోవాల్సిందే అన్న పరిస్థితి పాకిస్థాన్ జట్టులో ఏర్పడింది. ఇంతలోనే తన ఓవర్ చివరి బంతికి కూడా బుమ్రా మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా బంతిని సల్మాన్ అఘా గాల్లోకి లేపాడు (India – Pakistan). దానిని పాండ్యా క్యాచ్ పట్టాడు. సల్మాన్ ఆఘా 4 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ప్రస్తుతానికి పాకిస్థాన్ 2 ఓవర్లకు గానూ 3 వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది.
Read Also: ప్రధాని మోడీపై వ్యంగ్య వ్యాఖ్య? నటి తాప్సి వీడియో వైరల్
Follow Us On: Sharechat


