Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోడీపై వ్యంగ్య వ్యాఖ్య? నటి తాప్సి వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్:  ప్రముఖ నటి తాప్సి పన్ను(Taapsee Pannu)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి. ఈ దేశంలో స్వేచ్ఛ లేదు అన్నట్టుగా నటి తాప్సి ప్రవర్తించారు. అసలేం జరిగింది? తాప్సీ చేసిన కామెంట్లు ఏమిటి? ఈ కథనంలో చూద్దాం..

తాప్సి పన్ను ఇటీవల ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూకు వెళ్లారు. ఇంటర్వ్యూ సమయంలో యాంకర్ ర్యాపిడ్ ఫైర్‌లో భాగంగా ప్రశ్నలు అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరి ఫొటోలు చూపించి ఏ నేత అంటే ఇష్టమని అడిగారు.

ఈ ప్రశ్నకు తాప్సీ (Taapsee Pannu) ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రధాని మోడీ అని వెంటనే సమాధానమిచ్చింది. ‘నేను ఇంకా ఈ దేశంలోనే ఉండాలని అనుకుంటున్నా’ అందుకే అలా చెప్పాను అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు తాప్సి పన్ను ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. బీజేపీ అనుకూల నెటిజన్లు మీద తాప్సీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాప్సి పన్ను అలా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదంటున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>