Mobile Popup Ad
Mobile Popup Ad

LPG గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..!

కలం, వెబ్​ డెస్క్​: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో గ్యాస్ సిలిండర్ల (LPG Supply) కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ల సరఫరాను కేంద్రం నిలిపివేయగా గృహా వినియోగదారుల సిలిండర్ల సరఫరాపై ఆందోళన నెలకొంది. గ్యాస్ సిలిండర్లు అందుతాయో? లేదో? అనే భయంతో పలువురు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో ఆయా గ్యాస్ ఏజెన్సీల వెలుపల ప్రజలు పొడవైన క్యూలు కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో LPG గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అందుతోంది.

అంతర్జాతీయ నివేదిక ప్రకారం… ఓ భారత (India) ఎల్పీజీ ట్యాంకర్ హార్ముజ్ జలసంధిని దాటింది. దీంతో ఇరాన్ తో భారత్ సంప్రదింపులకు దిగింది. భారత నౌకలను సురక్షితంగా జలసంధిని దాటించాలని మంతనాలు జరుపుతుంది. అంతకుముందు ప్రధానమంత్రి మోదీ ఈ విషయంపై ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడారు. ఇద్దరు నాయకుల మధ్య సానుకూల సంభాషణ తర్వాతే ఇరాన్ భారత నౌకలను హార్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ ట్యాంకర్ రెండు రోజుల్లో భారత్ చేరుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ఇదే నిజమైతే భారత్ లో LPG గ్యాస్ కొరత తీరినట్లేనని చెప్పొచ్చు. ఇది భారత ప్రజలకు పెద్ద ఉపశమనంగా భావించవచ్చని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

Read Also: కేంద్రం వల్ల వరి సాగు కష్టంగా మారేలా ఉంది : మంత్రి తుమ్మల

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>