Mobile Popup Ad
Mobile Popup Ad

మరోసారి తల్లైన టాలీవుడ్ నటి

కలం, సినిమా : టాలీవుడ్ లో ‘సీమ టపాకాయ్’.. ‘అవును’ వంటి పలు సినిమాల్లో నటించిన నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ (Actress Poorna) రెండోసారి తల్లయింది. మార్చి 14న ఉదయం 4 గంటల 25 నిమిషాలకు ఆమెకు పాప పుట్టింది. ఈ విషయాన్ని పూర్ణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ అయినందుకు భగవంతునికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు . అలాగే వైద్య సిబ్బందికి ధన్యవాదాలు అంటూ ఆమె రాసుకొచ్చారు.

కాగా, నటి పూర్ణ (Actress Poorna) 2022లో దుబాయ్ వ్యాపారవేత్త అయిన షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడారు. 2023లో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత గుంటూరు కారం మూవీలో కుర్చీ మడత పెట్టీ సాంగ్ తో రీ ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ చేసిన ఆమె .. టెలివిజన్ షో ‘ఢీ’ లో జడ్జ్ గా వ్యవహారించారు. ‘అఖండ’, ‘అఖండ 2’ వంటి సినిమాలను తీశారు. అయితే గత ఏడాది గర్భం దాల్చడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు పూర్ణ. ఇక ప్రస్తుతం ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటుంబం పరిపూర్ణమైందని అభిమానులు సోషల్ మీడియాలో అంటున్నారు. ఈ మేరకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పూర్ణ దంపుతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read Also: ఇండియాలో భారీ స్థాయిలో ఉద్యోగులను తీసేస్తున్న మెటా..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>