హైడ్రాకు దమ్ముంటే.. కేటీఆర్ సంచలన సవాల్

కలం, వెబ్ డెస్క్: హైడ్రా పేరుతో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విధ్వంసం సృష్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో అక్కడి మీడియాతో మాట్లాడారు. హైడ్రాకు దమ్ముంటే.. ఎఫ్‌టీఎల్ (FTL)లో ఉన్న మంత్రుల ఇళ్లు కూలగొట్టాలని సవాల్ విసిరారు. హైడ్రా 9 తలల విషసర్పమని హైకోర్టు చెప్పిందని.. ముఖ్యమంత్రికి ఇంతకన్నా చెంపపెట్టు ఏముంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల బిల్డింగ్ లు చెరువులో ఉన్నా హైడ్రా ముట్టదని, హైడ్రా టచ్ చేసేది పేదల భూములు మాత్రమేనని మండిపడ్డారు.

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం రాగానే హైడ్రాను బంగాళాఖాతంగా పడేస్తామని కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నోసార్లు హైకోర్టు చెప్పినా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వినలేదని విమర్శించారు. దూకుడు చర్యలతో హైడ్రా ఎన్నో వేల ఇండ్లను కూల్చలేదా అని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేయడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతి స్కీం వెనుక స్కాం ఉంటుందని మండిపడ్డారు. అందుకే హైడ్రాను రేవంత్ రెడ్డి వెనకేసుకొని వస్తున్నారని విమర్శించారు.

Read Also : ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>