కలం, కరీంనగర్ బ్యూరో : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ (Karimnagar) నార్త్ జోన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఎస్ఐఆర్’ ప్రవాస్ అభియాన్’ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా సవరణ అత్యంత కీలకమని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. స్వచ్ఛమైన ఓటరు జాబితా ద్వారానే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యపడుతుందని తెలిపారు. బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన వారి ఓటు నమోదు అయ్యేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ పూర్తయ్యేవరకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న తరుణంలో బీఎల్‌ఏ-2లు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు, ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ప్రతి బూత్ స్థాయిలో సమీక్షలు నిర్వహించి.. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా సంప్రదించి అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు. ఓటరు జాబితా ప్రక్షాళనకు గడువు చాలా తక్కువగా ఉన్నందున, ప్రతి కార్యకర్త దీనిని కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా ఒక పవిత్రమైన ప్రజాసేవగా భావించి అంకితభావంతో పని చేయాలని సూచించారు
డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత కూడా జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్ల వివరాలను తక్షణమే ఫారం-6 ద్వారా నమోదు చేయించాలని, స్వయంగా అందుబాటులో లేని ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేలా కార్యకర్తలు తగిన చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించడం ద్వారా ఎ ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని, ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఎటువంటి తప్పులు లేకుండా ఉండేలా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణపై ప్రజలకు, ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ఓటరు జాబితా ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేవరకు అర్హులైన ప్రతి ఒక్క ఓటు నమోదు కోసం బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండారి వేణు, సోమిడి వేణు కో ఆప్షన్ మెంబెర్ చిగిరి వెంకటమ్మ , సాదినేని మునీందర్ , చిగురు రవీంద్ర , నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్ , మీడియా కన్వీనర్ కటకం లోకేష్ , అడిచర్ల రాజు, బోయిని శ్రీనివాస్ , గిన్నె శ్రీనివాస్, జక్కుల నిఖిల్ , వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also : ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
Follow Us On : WhatsApp

