1,057 మందికి కేంద్ర పతకాలు.. ప్రకటించిన కేంద్ర హోం శాఖ

కలం, వెబ్ డెస్క్: భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని కేంద్ర హోంశాఖ పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు 1057 మందికి శౌర్య, సేవా పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ ఈసారి 301 గ్యాలెంటరీ అవార్డులను (Gallantry Awards) ప్రకటించింది. 272 మంది పోలీసులకు, 29 మంది అగ్ని మాపక సిబ్బందికి ఈ అవార్డు దక్కింది.

సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో, నేరాలను అదుపులో ఉంచడంలో, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ప్రాణాలకు తెగించి పోరాడిన సిబ్బందికి ‘మెడల్ ఫర్​ గ్యాలెంటరీ’ అందజేయనుండగా.. నక్సలైట్​ (ఎల్​డబ్ల్యూఈ) ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన 197 మందికి, జమ్మూకశ్మీర్​- 51, ఈశాన్య రాష్ట్రాలు-12, ఇతర ప్రాంతాలు- 41 మందికి ఈ గ్యాలెంట్రీ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మరోవైపు 92 మందికి ‘రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం’ (పీఎస్​ఎం) పురస్కారం ప్రకటించింది. పోలీస్​ సర్వీస్​- 83, అగ్నిమాపక విభాగం- 4, సివిల్ డిఫెన్స్ అండ్​ హోంగార్డ్స్​- 3, కరెక్షనల్ సర్వీస్​- 02 చొప్పున అవార్డులను ప్రకటించింది. నిరంతర అంకితభావతంతో పనిచేసిన వారికి ‘మెరిటోరియస్​ సేవా పతకం’ (ఎంఎస్​ఎం) అందిస్తారు.

‘మెడల్ ఫర్​ గ్యాలెంటరీ’ , ‘రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం’, ‘మెరిటోరియస్​ సేవా పతకం’ విభాగాల్లో ఏపీ లోని పోలీసు సర్వీసుకు 7, 2, 14 అవార్టులు దక్కగా.. తెలంగాణలోని పోలీసు సర్వీసుకు 3, 2, 10 పతకాలు అందనున్నాయి. ఫైర్ సర్వీసుల్లో ఏపీకి , తెలంగాణకు రెండేసి చొప్పున మెరిటోరియస్​ సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>