కలం, స్పోర్ట్స్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కేవలం మూడు ఓవర్ల వ్యవధిలోనే ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. తొలుత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన మాయాజాలంతో డేంజర్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌ను క్లీన్ బౌల్డ్ చేశారు. అంతకుముందు బంతికి ఫోర్ కొట్టిన డికాక్‌ను, ఆ మరుసటి బంతికే అద్భుతమైన వేగంతో బోల్తా కొట్టించి బుమ్రా ప్రతీకారం తీర్చుకున్నారు. డికాక్ కేవలం 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు.
ఆ వెంటనే మరో ఎండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తన పదునైన బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్‌ను అవుట్ చేశారు. అర్ష్‌దీప్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మార్‌క్రమ్, మిడ్-ఆఫ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయారు. మార్‌క్రమ్ 7 బంతుల్లో 4 పరుగులకే అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల ధాటికి స్టేడియం మొత్తం ‘ఇండియా ఇండియా’ నినాదాలతో హోరెత్తిపోతోంది.
ఓపెనర్లు ఐట్ అయిన షాక్ నుంచి దక్షిణాఫ్రికా బయటపడే ముందే మరో వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రికల్టన్ కూడా వికెట్‌ను సమర్పించుకున్నాడు. బుమ్రా వేసిన బంతికి గాల్లోకి లేపగా దూబే క్యాచ్ పట్టాడు. హిట్టర్ అని పేరున్న రికల్టన్ 7 బంతుల్లో 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా 4.2 ఓవర్లకు 21 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.
Read Also: అక్షర్ పటేల్‌పై వేటు.. ఫ్యాన్స్ షాక్!
Follow Us On: X(Twitter)


