కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లాలో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. నర్సాపూర్ (మం) కాగజ్ మద్దూర్ లో మరిడి ఇండస్ట్రీస్ పేరుతో ఉన్న బయో పరిశ్రమలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 50 కాటన్ల విదేశీ మద్యంను పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు. అయితే ఇంత పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని ఎందుకు నిల్వ ఉంచారు అనేది తెలియాల్సి ఉంది.
Read Also: ఏసీపీ వసుంధర యాదవ్ చొరవ.. వెలుగులోకి రూ. 547 భారీ సైబర్ క్రైమ్
Follow Us On : WhatsApp

