epaper
Sunday, March 1, 2026
epaper

సమ్మర్‌లో నీటి కొరతపై సీతక్క సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వేసవి కాలం దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని మంత్రి సీతక్క (Minister Seethakka) అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై చర్చించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తగినంత నీటి లభ్యత ఉందని, సోర్స్ పాయింట్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేనందున వేసవిలోనూ నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తామని మంత్రికి వివరించారు.

మంత్రి సీతక్క ఎస్ఈల పరిధిలోని నివాసాలకు అందుతున్న నీటి వివరాలను క్షేత్రస్థాయి వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా మిషన్ భగీరథ సిబ్బంది పనిచేయాలని సూచించారు. పైపులైన్ల లీకేజీలు, మోటార్ల మరమ్మతులు వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎండాకాలం (Summer)లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశించారు.

Read Also: పేదల ఇండ్లు కూలిస్తే పరామర్శించే హక్కు లేదా? ఎమ్మెల్సీ తాత మధు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!