Mobile Popup Ad
Mobile Popup Ad

అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీ పట్టివేత

కలం, మెదక్ బ్యూరో: అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని మెదక్ (Medak) జిల్లాలో గోరక్షక్ కార్యకర్తలు పట్టుకున్నారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలోని డబ్బా వద్ద ముందస్తు సమాచారం తో గోరక్షక్ కార్యకర్తలు అడ్డగించారు.

సమాచారం అందుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న సుమారు 30 గోవులను సురక్షితంగా గోశాలకు తరలించారు. లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>