Mobile Popup Ad
Mobile Popup Ad

1500 అడుగుల ఎత్తులో ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌.. చివ‌ర‌కు ఏమైందంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: న్యూయార్క్ (New York)​లోని ఎంపైర్​ స్టేట్​ బిల్డిండ్​ (Empire State Building) పై చోటు చేసుకున్న ఓ అనూహ్య ఘటన అందరినీ షాక్​కు గురి చేసింది. ఓ జంట బిల్డింగ్​ పై భాగానికి చేరుకొని ఓ బ్యానర్​ ప్రదర్శించారు. అంతే కాకుండా యువకుడు తన ప్రియురాలికి మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్​ చేసి ఇద్దరూ ముద్దు కూడా పెట్టుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. న్యూయార్క్​ పోలీసులు రంగంలోకి దిగి ఈ ప్రేమ జంటను అరెస్ట్​ చేశారు. వీరిని ఏంజెలీనా నికోలావ్​, ఇవాన్​ కుజ్నెత్సోవ్​లు​గా గుర్తించారు.

ఇద్దరూ నలుపు రంగు దుస్తులు, మాస్కులు ధరించి బిల్డింగ్​పై నానా హంగామా సృష్టించారు. సుమారు 1500 ఎత్తులో నిలబడి ఓ బ్యానర్​ ప్రదర్శించారు. అందులో అధికారంపై ఉన్న ప్రేమను అధిగమించి.. ప్రేమ శక్తిని గెలిచినప్పుడు ప్రపంచానికి శాంతి లభిస్తుందని రాసుకున్నారు. ఇవాన్​ అక్కడే తన ప్రియురాలు ఏంజెలీనాకు మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్​ చేశాడు. ఇద్దరూ కౌగిలించుకొని ముద్దు కూడా పెట్టుకున్నారు. అనంతరం వారు కిందకు రాగానే న్యూయార్క్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

1250 అడుగుల ఎత్తున్న ఈ స్కై స్క్రాపర్​ పై భాగంలో ఉన్న 200 అడుగుల పొడవైన స్పైర్​ పైకి వారు ఎలా ఎక్కారన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ప్రస్తుతం వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన వల్ల పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎంపైర్​ స్టేట్​ బిల్డింగ్​ ప్రతినిధి స్పష్టం చేశారు. ఫిఫా మ్యాచ్​లు, పలు వేడుకల రద్దీతో పాటు తీవ్ర ఎండలు ఉన్న నేపథ్యంలో నగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>