కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీస్ (Telangana Police) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలు, పోలీస్ ఉన్నతాధికారులకు భద్రత కుదించింది. భద్రతా కారణాల వల్ల ప్రముఖులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. మాజీ డీజీపీలకు ఎస్కార్ట్ కుదించిన ప్రభుత్వం.. కొందరు రాజకీయ నాయకులు, ప్రముఖుల గన్ మెన్లను తొలగించింది.
ఇటీవల సమావేశం అయిన భద్రతా కమిటీ ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం మేరకు భద్రత కుదించడంపై చర్చించింది. దీంతో గురువారం కమిటీ తీసుకున్న నిర్ణయాలను అమలు పరిచింది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో ఇంటలిజెన్స్ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: రూ.32 లక్షల జాబ్‌ని వదులుకున్న యువతి.. ఎందుకో తెలుసా!
Follow Us On: Sharechat

