కలం, కరీంనగర్ బ్యూరో: హిందూ ధర్మం (Hindu Dharma) అంటే మతం కాదు, జీవన విధానమని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ సంఘ్ చాలక్ ఎలగందల సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో శ్రీరామ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో సత్యనారాయణ మాట్లాడారు. హిందూ ధర్మం , సనాతన ధర్మానికి శాశ్వత చిరునామా భారతదేశమే అన్నారు. అందుకే ప్రపంచ దేశాల్లో అన్నింటికంటే భారత దేశానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి సంప్రదాయాలుకాపాడుకోవాలన్నారు. దేశ ప్రగతికి సత్యం, ధర్మం వంటి విలువలను ఆచరించడం అవసరమని తెలిపారు.
పంచ పరివర్తనలతోనే మార్పు..
పంచ పరివర్తనల ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ఆ దిశగా ముందుకు కొనసాగాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ సంఘ్ చాలక్ ఎలగందల సత్యనారాయణ తెలిపారు. హిందూ ధర్మ (Hindu Dharma) పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. హిందూ సమాజం ఐక్యతతో ఉండాలన్నారు. హిందూ ధర్మ రక్షణ, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళన సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో శ్రీరామ హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు సరఫ్ రామకృష్ణ , గర్రెపల్లి మహేశ్వర శర్మ అయ్యగారు, మహిళా వక్త అనుపమ, ముంజంపల్లి, శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, ఈదులగట్టపల్లి గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also: సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్.. 300 ప్రత్యేక బృందాలతో దాడులు
Follow Us On: Sharechat

