కలం, వెబ్ డెస్క్ : హనుమకొండ (Hamumakonda) బస్టాండ్ సమీపంలోని ఓ ఉడిపి హోటల్ ఆహారంలో ఈగలు రావడంతో కస్టమర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. భోజనం చేస్తున్న సమయంలో ఫుడ్‌లో ఈగలు కనిపించడంతో వారు హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అనంతరం ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హోటల్ లో తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో హోటల్‌ను అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హోటల్లోని తినుబండారాలపై, టీ తయారీ ప్రాంతం వద్ద పెద్ద సంఖ్యలో ఈగలు సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆహార నమూనాలను సేకరించారు. హోటల్‌పై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం, అపరిశుభ్రత ఉన్నట్లు నిర్ధారించామని, నిబంధనల ప్రకారం హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.

