కుళ్లిన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు.. తయారీ కేంద్రం సీజ్

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ నగరం జియాగూడ (Ziaguda)లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అక్రమ సమోసా తయారీ కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్న ఈ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ (H-FAST) కుల్సుంపురా పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 5 లక్షల రూపాయల విలువైన కల్తీ ఆహార నిల్వలను సీజ్ చేసి, నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్​ నేతృత్వంలోని బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి జియాగూడలోని (Ziaguda) SBA గార్డెన్ సమీపంలో ఉన్న ఒక నివాస ప్రాంగణంలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో 73 ఏళ్ల అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి ఎటువంటి లైసెన్సులు లేకుండా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ తనిఖీ చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా సమోసాలను తయారు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ దాడుల్లో భాగంగా సుమారు 500 పాడైపోయిన కోడిగుడ్లు, ఐదు కిలోల వాడేసిన వంట నూనెతో పాటు పెద్ద మొత్తంలో తయారు చేసిన ఎగ్, స్వీట్ కార్న్, ఉల్లిపాయ సమోసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 50 కిలోల మైదా, వందల సంఖ్యలో సమోసా పట్టీలు, తయారీకి వాడే యంత్రాలను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడిపై కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఇలాంటి అక్రమ తయారీ కేంద్రాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సూచించారు.

 

Read Also: బాల ‘వనజీవి’.. 7 ఏండ్లకే వెయ్యికిపైగా మొక్కలు నాటిన బుడ్డొడు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>