మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్

కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy)కి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఆయన తరుఫున దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రోహిత్ రెడ్డి రేపు విడుదల కానున్నారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేయగా.. రోహిత్ రెడ్డికి మాత్రమే బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. రోహిత్ రెడ్డికి మాత్రమే న్యాయవాదులు బెయిల్ పటిషన్ దాఖలు చేశారు.

మొయినాబాద్ ఫాంహౌస్ (Moinabad Farmhouse) పై తెలంగాణ ఈగల్ పోలీసుల ఆకస్మిక దాడులలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy), ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ తదితరులు డ్రగ్స్ సేవించినట్లు తేలడం సంచలనంగా మారింది. అనంతర పరిణామాల్లో భాగంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ లు తదితరుల్ని వదిలేసిన పోలీసులు.. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డిని అలాగే సోదాల సమయంలో కాల్పులకు తెగబడిన నమిత్ శర్మలను పోలీసులు మార్చి 14న రాత్రి అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం 9 మందితో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ విచారణ కొనసాగిస్తున్న సమయంలో పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Also:  బతుకమ్మ కుంట వివాదం: హైడ్రాకు షాకిచ్చిన సుప్రీంకోర్టు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>