కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనాల సందర్భంగా జోష్ నెలకొంది. డ్యాన్స్ చేస్తున్న పోలీసులతో కలిసి సీపీ సజ్జనార్ (CP Sajjanar) కూడా కాలు కదిపారు. పాటలకు హుషారుగా డ్యాన్స్ చేస్తుండటం అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు డ్యాన్సులు చేశారు. ఫోక్ సాంగ్స్, హిందీ సాంగ్స్ పెట్టుకుని మరీ హుషారెత్తించారు.
ఒక కానిస్టేబుల్ వ్యాన్ పైకి ఎక్కి మరీ డ్యాన్స్ చేయడం, కెమెరాతో స్వయంగా షూట్ చేసుకోవడం అలరించింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి పోలీస్ అధికారులు ఒక వైపు డ్యూటీ చేస్తూనే.. మరోవైపు డ్యాన్సులు చేస్తూ అందరితో కలిసిపోయారు. ఆ వీడియోలు ఇన్ స్టా సహా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కొందరు పోలీసులు చేస్తున్న డ్యాన్సులు.. ప్రొఫెషనల్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
చివరి దశకు నిమజ్జనాలు..
ట్యాంక్ బండ్‌పై గణనాథుల నిమజ్జనం తుది దశకు చేరుకుంది. శుక్రవారం ఉదయం మొదలైన రద్దీ.. ప్రస్తుతానికి చివరి దశకు చేరుకుంది. సాయంత్రం నాటికి మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో నిమజ్జనాల ప్రక్రియ శాంతియుతంగా జరగడంతో పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకుంది. డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) సహా పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షణ చేశారు. ట్యాంక్ బండ్ వద్ద వేలాది సంఖ్యలో పోలీసులను బందోబస్తుగా నియమించి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనాల వేళ పోలీసుల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్‌గా మారాయి. సీపీ సజ్జనార్ కూడా పోలీసులతో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. 🕺🚔
డ్యూటీ చేస్తూనే డ్యాన్స్‌తో సందడి చేసిన పోలీసుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 🎶🔥Police personnel, along with CP… pic.twitter.com/xY4MMVuJL3
— Kalam Daily (@kalamtelugu) September 26, 2026
Also Read : ఖైరతాబాద్ బై పోల్ పోటీపై కవిత కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

