Mobile Popup Ad
Mobile Popup Ad

మూసీ ప్రక్షాళన అడిగేది మీరే.. అడ్డుకునేది మీరే : సీఎం రేవంత్​

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఆరెంజ్ కేటగిరీలో ఉన్న నగరాన్ని ఇలాగే వదిలేస్తే రెడ్ జోన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలని అందరూ అంటున్నారని, కానీ ప్రభుత్వం ఏదైనా కార్యాచరణ చేపడుతుంటే అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. అహ్మదాబాద్‌లో (Ahmedabad) పదివేల కుటుంబాలను తరలించి సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించారని, అక్కడ నిర్వాసితులకు సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదని గుర్తు చేశారు. ఢిల్లీలో యమునా, యూపీలో గంగా రివర్ ఫ్రంట్‌లు చేపట్టినప్పుడు లేని అభ్యంతరాలు హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

నిర్వాసితులకు సరైన సాయం అందించాలనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 2004లో ఈసా నది ఒడ్డున తొమ్మిది మీటర్ల బఫర్ జోన్‌లో (Buffer Zone) అపార్ట్‌మెంట్​ నిర్మించారని, ఆ తర్వాత నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 50 మీటర్ల లోపు కట్టడాలపై నిషేధం ఉందని, ఈ పరిధిలో ఉన్న నిర్మాణాలన్నీ జీరో వాల్యూతో సమానమని పేర్కొన్నారు. అందుకే అక్కడ నివసించే వారిని పిలిచి మాట్లాడి, వారికి ప్రత్యామ్నాయంగా ఏడు ఎకరాల భూమి ఇచ్చి, అపార్ట్‌మెంట్లు కట్టుకోవడానికి అవసరమైన డబ్బును డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చామని వెల్లడించారు. అయితే ఈ అంశాన్ని రాజకీయ రంగు పూసి, కొన్ని పార్టీలు కేవలం సానుభూతి చూపిస్తున్నాయని, సానుభూతితో సమస్య పరిష్కారం కాదని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు కేవలం నాలుగు రోజులు మాత్రమే అక్కడ ఉంటాయని, ప్రజల కన్నీళ్లను ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. బఫర్ జోన్‌లో ఉన్న వారికి జరుగుతున్న నష్టంపై చర్చిస్తే బాగుంటుందని, తాము చేయలేదు కాబట్టి మీరు కూడా చేయవద్దు అనే భావనలో ఇతర పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. మార్చి 13వ తేదీన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అలాగే గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కోసం 200 కోట్లు ఖర్చు చేయడంలో తప్పేముందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

Read Also: బిహార్​ డిప్యూటీ సీఎంగా నిశాంత్​!

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>