Mobile Popup Ad
Mobile Popup Ad

మూసాపేట్ లో భారీ అగ్ని ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూసాపేట్ (Moosapet Fire Accident )లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ వాహనాల గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గోదాం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుపోగా, మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 50 ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధం అయ్యాయని సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: శ్రీలంక మాజీ కెప్టెన్‌ను ఆకట్టుకున్న వైభవ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>