కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రైవేటు పాఠశాలల కన్నా నాణ్యమైన విద్యా సేవలు అందిస్తున్న బోయపల్లి (Boyapalli) ప్రాథమిక పాఠశాల పనితీరును డీఈవో విజయకుమారి కొనియాడారు. బోయపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో విజయకుమారి విద్యార్థులచేత అక్షరాభ్యాసం చేయించి విద్యార్థులను ఆశీర్వదించారు. పాఠశాలలోని అన్నీ తరగతి గదులను పరిశీలించి.. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో విజయకుమారి పాటు సీఎంవో సుధాకర్, ఎంఈవో లక్ష్మణ్ సింగ్, పాఠశాల హెచ్ఎం హరినాథ్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: శ్రీలంక మాజీ కెప్టెన్‌ను ఆకట్టుకున్న వైభవ్
Follow Us On: X(Twitter)

