ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక భేటీ

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు మొదటి దశ ప్రాజెక్టును రెండు రోజుల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తో ఇవాళ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యన్ భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన మంగళవారం జరిగిన హెచ్‌ఎండీఏ బోర్డు సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్ట్ స్వాధీన పక్రియకు ఆమోదముద్ర పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో L&T ఛెర్మన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా, సాధారణంగా హైదరాబాద్ మెట్రో ‘పీపీపీ’ (ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం) పద్ధతిలో నడుస్తోంది. ఈ మేరకు భూమి ప్రభుత్వం ఇస్తే.. రైళ్లు, స్టేషన్ల నిర్మాణం L&T టీమ్ చూసుకుంటూ వస్తోంది. అయితే ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలోని మొత్తం మెట్రో ఆస్తులను కొనేస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.15 వేల కోట్ల డీల్ కుదిరింది. ఇందులో భాగంగా ఎల్ అండ్ టీ మెట్రో పేరు మీద ఉన్న రూ.13,615 కోట్ల అప్పును ప్రభుత్వం చెల్లించనుంది. దీనికోసం ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి తక్కువ వడ్డీకి కొత్త అప్పు తీసుకుంటుంది. రెండవది.. ఎల్ అండ్ టీ పెట్టిన పెట్టుబడికి బదులుగా హెచ్‌ఎండీఏ (HMDA) నుంచి రూ.1,385 కోట్లను ఆ కంపెనీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. స్వాధీన ప్రక్రియ గడువు ఈ నెల 30వ తేదీ కావడంతో L&T ఛెర్మన్ సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా కలిసినట్లు తెలుస్తోంది. రేపు ఇరువురి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు సమాచారం అందుతోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>