Mobile Popup Ad
Mobile Popup Ad

ఘట్‌కేసర్‌లో విషాదం: రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ (Ghatkesar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను కుంట్లూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రవికుమార్, శిరీషగా పోలీసులు గుర్తించారు. వీరు వరంగల్ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ దంపతుల ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>