Mobile Popup Ad
Mobile Popup Ad

థైరాయిడ్ వల్ల కంటి చూపు దెబ్బతింటుందా? నిపుణుల వివరణ

కలం, వెబ్‌డెస్క్: నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్ (Thyroid). సాధారణంగా థైరాయిడ్ సమస్యలు అంటే బరువు పెరగడం, అలసట, హెయిర్ ఫాల్, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు ఉంటాయని మనకు తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సమస్య కంటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? అవును కొంత మందిలో థైరాయిడ్ సమస్య కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

థైరాయిడ్ అంటే ఏమిటి?

థైరాయిడ్ మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అంతఃస్రావిక గ్రంథులలో ఒకటి. ఇది మెడ ముందు భాగంలో, వాయునాళం చుట్టూ ఉండే ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన థైరాక్సిన్ (Thyroxine) హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ జీవక్రియను నియంత్రిస్తుంది. అయితే ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయినా లేదా తక్కువగా ఉత్పత్తి అయినా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా థైరాయిడ్ సమస్యలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. అవి

1. హైపర్‌థైరాయిడిజం: హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం. దీనివల్ల శరీర జీవక్రియలు మందగిస్తాయి. కారణం లేకుండా బరువు పెరగడం, తీవ్రమైన అలసట, నీరసం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి.

2. హైపోథైరాయిడిజం: థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి కావడం. దీనివల్ల శరీర జీవక్రియలు వేగవంతమవుతాయి. వేగంగా బరువు పెరగడం, గుండె వేగంగా కొట్టు కోవడం, అధికంగా చెమటలు పట్టడం, చేతులు వణకడం, ఆందోళన, కోపం రావడం, వేడిని అస్సలు తట్టుకోలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

థైరాయిడ్ కళ్లను ప్రభావితం చేస్తుందా?

థైరాయిడ్ కళ్లను ప్రభావితం చేస్తుందా అంటే.. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ముఖ్యంగా గ్రేవ్స్ వ్యాధి ఉన్నవారిలో థైరాయిడ్ ఐ డిసీజ్ అనేది ఒక తీవ్రమైన దుష్ప్రభావం. అయితే ఈ వ్యాధిలో మన శరీర రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధితో పాటు కళ్ల వెనుక ఉన్న కండరాలు, కొవ్వు కణజాలాలను కూడా శత్రువుగా భావించి దాడిచేస్తుంది. దీనివల్ల కళ్లలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి.

కళ్లలో కనిపించే ప్రధాన లక్షణాలు

కళ్లు ముందుకు రావడం, కనురెప్పలు పైకి లాగబడటం, కళ్లలో మంట, పొడిబారడం, డబుల్ విజన్, కంటి వెనుక నొప్పి, కాంతిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే వ్యాధి తీవ్రత పెరిగితే ఆప్టిక్ నరంపై ఒత్తిడి పెరిగి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే కళ్లలో పై లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కళ్లలో కనిపించే ఈ మార్పులే థైరాయిడ్ సమస్యకు తొలి సంకేతాలుగా ఉండొచ్చు. సకాలంలో పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభిస్తే కంటి చూపును కాపాడుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>