కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరంలో గ్యాస్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. వినియోగదారులు బుకింగ్ చేసుకున్నా సకాలంలో సిలిండర్లు అందడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్లు నగరంలోని ఓ ఏజెన్సీలో సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఏరియాలో చాలామంది ప్రజలు ఇటీవల గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు. ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా గ్యాస్ సిలిండర్లు అందడం లేదని చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఒక గ్యాస్ సిలిండర్ల ఆటో షేక్‌పేట్ ఏరియాలోకి వచ్చింది. అంతే అక్కడే ఉన్న కస్టమర్లు ఒక్కసారిగా గ్యాస్ ఆటోపై ఎగబడ్డారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్థానికుల సహాయంతో ఏజెన్సీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. గ్యాస్ సిలిండర్లను మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందించాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

