కలం, వెబ్ డెస్క్ : కల్తీ ఆహారపదార్థాలు తయారు చేస్తున్న కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి నకిలీ ముఠాలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఆగడాలు ఆపడం లేదు. కాసులే లక్ష్యంగా వ్యాపారాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా, హైదరాబాద్ లో కల్తీ పనీర్ (Fake Paneer) తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు దాడులు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు చేశారు. 45 అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి 825 కిలోల కల్తీ పనీర్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పనీర్ పేరుతో “చీజ్ అనలాగ్” విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి నకిలీ పనీర్ (Fake Paneer) సరఫరా అవుతోంది. వీటిని FSSAI లైసెన్సులు, లేబుళ్లు, ఎక్స్‌పైరీ వివరాలు లేకుండానే విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, తనిఖీల్లో పిండిపదార్థాలు, నాణ్యతలేని సింథటిక్ పాలు, ప్రమాదకర రసాయనాలను అధికారులు గుర్తించారు. ఈ కల్తీ పనీర్ వల్ల ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు వచ్చే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ ఉన్న వ్యాపారుల వద్ద నుంచే పనీర్ కొనాలని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ వైభవ్ గైక్వాడ్ హెచ్చరించారు.
Read Also: ఎమ్మెల్యేల పనితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!
Follow Us On: X(Twitter)

