Mobile Popup Ad
Mobile Popup Ad

మరో క్రేజీ మల్టీ స్టారర్.. అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ లాంచ్

కలం, సినిమా : టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) లేటెస్ట్ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), నందమూరి హీరో కళ్యాణ్  రామ్ (Kalyan Ram) ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై సినీ అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, వెంకటేష్ సరసన కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తుండగా , కళ్యాణ్ రామ్‌కు జోడీగా  కృతి శెట్టి నటిస్తుంది. ఈ రెండు జంటలు తెరపై ఎలా అలరిస్తాయో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ కలగలిపిన కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also: లొకేషన్ ముఖ్యం కాదు, ఫీలింగ్ ముఖ్యం.. జెన్‌జీ ‘ట్రావెల్‌’ ట్రెండ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>