కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో (Hyderabad) మరో డ్రగ్స్ ఫ్యాక్టరీ బాగోతాన్ని ఈగల్ ఫోర్స్ బయటపెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తూ.. విదేశాలకు ఎగుమతి చేస్తున్న ముఠాను పట్టుకుంది. డ్రగ్ కింగ్ పిన్ మత్స్యగిరిని అరెస్ట్ చేసి రూ.50 లక్షల విలువైన ‘మెఫెడ్రోన్’ సీజ్ చేశారు. ఒకప్పుడు రసాయన శాస్త్రవేత్తగా పనిచేసిన మత్స్యగిరి.. అధికంగా సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ వ్యాపారం వైపు మళ్లాడు. భారీ స్థాయిలో డ్రగ్స్ తయారు చేస్తూ పలుమార్లు పోలీసులకు కూడా చిక్కాడు. విడుదలైన తరువాత మళ్లీ డ్రగ్ బిజినెస్ చేస్తుండటంతో పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. గత 6 నెలల పాటు ముఠా కార్యకలాపాలను గమనించి, చివరికి అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈగల్ ఫోర్స్ అధికారులు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

