Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో(Hyderabad) సీఐడీ పోలీసులు భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా (Cricket Betting Racket)  గుట్టురట్టు చేశారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తూ వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఈ ముఠా వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన నెట్‌వర్క్‌తో ఈ కార్యకలాపాలు కొనసాగినట్లు సమాచారం.

సీఐడీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి కీలక డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అంతర్జాతీయ స్థాయి బెట్టింగ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>