హుజురాబాద్‌లో ఒక్క ఓటు కూడా వృథా కావొద్దు: కోమటిరెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో సమగ్ర ఓటు సవరణ నమోదు ప్రక్రియ (SIR) సమయం దగ్గర పడతుండటంతో కరీంనగర్ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీఎల్ఏల పనితీరు, సందేహాలపై హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ సర్ ఇన్‌చార్జి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కమలాపూర్ హాజరైన ఈ కార్యక్రమంలో వీణవంక గ్రామాల బిఎల్ఏ, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు.

బిఎల్ఏ వద్ద ఉన్న పూర్తి సమాచారం కోఆర్డినేటర్ల వద్ద ఉందా లేదా అని ప్రశ్నించారు?గ్రామాల్లో ఓటు నమోదు ఫారం రాకపోతే బీఎల్‌ఎకు తెలిపాలన్నారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ హుజురాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించారని, ఒక్క ఓటు కూడా వృథా కావొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, వీణవంక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>