Mobile Popup Ad
Mobile Popup Ad

ఒకే జిల్లాలో భర్త ఎస్పీ, భార్య కలెక్టర్.. దంపతుల పరిపాలన

కలం, వరంగల్ బ్యూరో : మానుకోట జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. జిల్లా పాలకులుగా దంపతులు భాద్యతల్లో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశమైంది. మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైన తర్వాత పలువురు కలెక్టర్లు, ఎస్పీలు భాద్యతలు నిర్వర్తించారు. కానీ తాజాగా జరిగిన కలెక్టర్ల బదీలీల్లో హనుమకొండ కలెక్టర్ గా ఉన్న స్నేహ శభరీష్ మహబూబాబాద్ కలెక్టర్ గా వెళ్లారు. అయితే అప్పటికే ఆ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న శభరీష్ ఎవరో కాదు.. స్నేహ శబరీష్​ భర్త.

భార్యకు సెల్యూట్ చేస్తారా..?

జిల్లా పాలకులుగా భార్యాభర్తలు పనిచేయడం అరుదైన విషయంగానే చెప్పుకోవాలి. ములుగు ఎస్పీగా పనిచేస్తున్న శభరీష్ మేడారం జాతరకు ముందు మహబూబాబాద్ ఎస్పీగా బదీలీ అయ్యారు. అప్పటికే ఆయన భార్య స్నేహ హనుమకొండ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. తాజాగా జరిగిన బదీలీల్లో ఆమె మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా వెళ్లడంతో.. ఇద్దరి పేర్లు వార్తల్లో నిలిచాయి. పరిపాలన పరంగా చూస్తే కలెక్టర్ పెద్ద పోస్ట్. ప్రోటోకాల్ ప్రకారం ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న కలెక్టర్ కు ఎస్పీ సెల్యూట్ చేయాల్సిందే. స్నేహ శభరీష్ కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎస్పీ శభరీష్ కలెక్టరేట్ కు వెళ్లి మర్యాద పూర్వకంగా ఆమెను కలవాలి. మరి భార్యకు భర్త సెల్యూట్ చేస్తారా.. లేదంటే స్నేహపూర్వకంగా షేక హ్యాండ్ ఇస్తారా అంటూ జిల్లాలో చర్చ జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>