Mobile Popup Ad
Mobile Popup Ad

జహీరాబాద్ చైర్మన్ ఎన్నిక రసవత్తరం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్ మున్సిపాలిటీలో (Zaheerabad Municipality) హంగ్ ఏర్పడింది. ఇక్కడ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మొత్తం 37 వార్డులున్న జ‌హీరాబాద్ మున్సిపాలిటీ‌లో ఏ పార్టీకి కుడా మెజార్టీ రాలేదు. బీఅర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2,  స్వ‌తంత్రులు ముగ్గురు విజ‌యం సాధించారు. చైర్మన్ పదవి కోసం 19 కౌన్సిల‌ర్లు మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారనున్నది.

జ‌హీరాబాద్ (Zaheerabad Municipality) కాంగ్రెస్, బీఅర్ఎస్ చైర్మ‌న్ ప‌దవి కోసం వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రుల  మద్దతు కీలకం కానున్నది.  వీరి మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా చైర్మన్ పదవిని దక్కించుకోలేదు. 16న జ‌రిగే చైర్మ‌న్ ఎన్నిక వ‌ర‌కు త‌మ త‌మ కౌన్సిల‌ర్లును కాపాడుకోవ‌డం క‌త్తి మీద సాముగా మారింది. మ‌రోవైపు చైర్మ‌న్ స్ధాన‌మే ల‌క్ష్యంగా బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంప్రదింపులు, క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్టు సమాచారం.

Read Also: తొర్రూర్‌లో బీఆర్ఎస్ విక్ట‌రీ.. స్టెప్పులేసిన ఎర్ర‌బెల్లి..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>