Mobile Popup Ad
Mobile Popup Ad

హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రాలో అంతరాయం

సంగారెడ్డి జిల్లా : రుద్రారం వద్ద మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌ లైన్‌లో భారీ లీకేజీ (Water Pipe Leakage) ఏర్పడింది. ఈ భారీ లీకేజీలను అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు జలమండలి అధికారులు చేపట్టారు. ఈ లీకేజీ వల్ల హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.

దీంతో ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్, కేపీహెచ్​ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్, ఆర్ సి పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, బీరంగూడ‌, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్ ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని జల మండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>