ఖమ్మం ఫారెక్స్‌ మోసం.. ఏఆర్‌ కానిస్టేబుల్‌పై ఆరోపణలు

కలం, ఖమ్మం బ్యూరో : ఫారెక్స్ మార్కెట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సాగిన కోట్ల రూపాయల దగా వెనుక ఖాకీల హస్తం ఉందన్న వార్త జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. స్వల్ప కాలంలోనే ఊహించని రీతిలో లాభాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు వల వేసి, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముఠా గుట్టును ఖమ్మం 1 టౌన్ పోలీసులు రట్టు చేశారు.

ఈ మోసం వ్యవహారంలో ఏఆర్ కానిస్టేబుల్ (AR Constable) తీర్థాల కిరణ్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు తేలడంతో, ఆయనతో పాటు మరో నలుగురిపై పోలీసులు విచారణ వేగవంతం చేసి కేసు నమోదు చేశారు. ​బాధితులు అందించిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు, ఈ ముఠాలోని ప్రధాన నిందితుడైన గోపతి యశ్వంత్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

బాధితుల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు ఏఆర్ కానిస్టేబుల్ హోదాను, ఆయన అండదండలను ప్రధాన ఆయుధంగా వాడుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితులు విడతల వారీగా బాధితుల నుంచి కోట్ల రూపాయల వరకు ఆన్‌లైన్, నగదు రూపంలో లావాదేవీలు జరిపినట్లు పోలీసు అధికారులు గుర్తించారు.

​ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారులలో ఒకరైన ఏఆర్ కానిస్టేబుల్ తీర్థాల కిరణ్‌‌తో పాటు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>