Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో జాంబియా మెడల్స్ వేట!

కలం, వెబ్ డెస్క్: గోనె సంచులపై యోగాసనాలు ప్రాక్టీస్ చేసిన స్థాయి నుంచి.. ఈరోజు ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌(Yogasana Championship)లో ఏకంగా ఆరు మెడల్స్ గెలిచే స్థాయికి జాంబియా (Zambia) దేశం చేరుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి ప్రపంచ పోటీల్లో జాంబియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా నియా విజయ్‌వర్గీయ అనే చిన్నారి మూడు సిల్వర్ మెడల్స్ సాధించింది. ఆఫ్రికా దేశాల్లో యోగా విస్తరించడానికి అక్కడ ఉంటున్న భారత సంతతి ప్రజల మద్దతే ముఖ్య కారణం. ఈ విజయాల వెనుక చితులా ఆల్బర్ట్ అనే స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ దశాబ్దాల కృషి ఉంది.

1980వ దశకంలో ఒక భారతీయుడి దగ్గర యోగా నేర్చుకున్న ఆల్బర్ట్.. పెద్దయ్యాక తన స్కూల్ పిల్లలకు దీనిని నేర్పించడం ప్రారంభించారు. మొదట్లో యోగా మ్యాట్లు లేకపోవడంతో పాత గోనె సంచులను కుట్టి వాటిపైనే ప్రాక్టీస్ చేయించారు. మతం అనే అనుమానంతో మొదట్లో కేవలం ఐదుగురు పిల్లలే వచ్చినా.. ఆయన వెనకడుగు వేయకుండా సోషల్ మీడియా ద్వారా యోగాను ప్రచారం చేశారు. ఈ క్రమంలో 2020లో ఒక భారత సంతతి మహిళ వీరికి యోగా మ్యాట్లను స్పాన్సర్ చేయడంతో పెద్ద మార్పు వచ్చింది.

స్థానిక భారతీయుల సహాయంతో యోగా అక్కడ ఒక క్రీడగా ఎదిగింది. దీనికి 2022లో ప్రభుత్వ గుర్తింపు లభించగా.. 2024 నుంచి జాతీయ పోటీలు ప్రారంభమయ్యాయి. 2025లో జరిగిన జాతీయ పోటీలను ప్రభుత్వ అధికారులు స్వయంగా పరిశీలించి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా 18 మంది సభ్యులతో జాంబియా బృందం భారత్‌లో జరిగిన ప్రపంచ పోటీలకు వచ్చింది. ఇందులో ఆరుగురు ఆటగాళ్లకు భారత సంతతి కుటుంబాలే ఆర్థిక సహాయం అందించాయి. జాంబియాతో పాటు రువాండా, నైగర్ వంటి ఎన్నో ఆఫ్రికా దేశాల ఆటగాళ్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>