epaper
Wednesday, February 18, 2026
epaper

పోచారం ORRపై ఘోర రోడ్డు ప్రమాదం..

కలం, వెబ్​ డెస్క్​ : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సమీపంలోని పోచారం (Pocharam) ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం (ORR Crash) చోటు చేసుకుంది. నెహ్రూ జూపార్క్​ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఓ కారు ప్రమాదవశాత్తు సర్వీస్​ రోడ్డుపై ఎగిరి పడింది. ఓవర్​ స్పీడ్​ కారణంగానే అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో ఓ చిన్నారితో సహా ఏడుగురు కార్లో ప్రయాణిస్తున్నారు. సర్వీస్​ రోడ్డుపై ఎగిరిపడడంతో కారు నుజ్జునుజ్జయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: భారత్‌కు షాక్‌.. అభిషేక్‌ ఔట్‌

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>