Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ గాయని ఆశా భోస్లే (Asha Bhosle) కన్నుమూశారు. గత రెండు రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. హఠాత్తుగా చెస్ట్ పెయిన్, ఊపిరి పీల్చుకోవడంలో తలెత్తిన సమస్యలతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆశా భోస్లే వయసు 92 సంవత్సరాలు. ఈమె లతా మంగేష్కర్‌కు సోదరి. ఆమె అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 4.00 గంటలకు శివాజీ పార్కులో జరగనున్నట్లు కుమారుడు ఆనంద్ భోస్లే తెలిపారు. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో పుట్టిన ఆమె తన సోదరి లతా మంగేష్కర్ ద్వారా బాలీవుడ్ సినీ పరిశ్రమకు గాయనిగా పరిచయం అయ్యారు. వేలాది పాటలు పాడిన ఆమె 2000వ సంవత్సరంలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను పొందిన ఆమె రెండుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకున్నారు. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవ, కృషికి గుర్తింపుగా 2008లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరించింది. ఆశా భోస్లే 1970 డికేడ్‌లో ఆలపించిన పియా తు అబ్ తో ఆజా, దమ్ మారో దమ్, చురా లియా హై తుమ్నే పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. మహమ్మద్ రఫీ కాంబినేషన్‌లో ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా”, “ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ” వంటి సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. కేవలం కమర్షియల్ పాటలకే పరిమితం కాకుండా గజల్స్‌ను సైతం ఆశా భోస్లే పాడి జాతీయ అవార్డులను అందుకున్నారు.

Read Also:  అమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ రిలీజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>