కలం, వెబ్ డెస్క్: హిమాలయ మంచుకొండల్లో ఆధ్యంతం శివపారవశ్యంతో సాగే అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra 2026) షెడ్యూలు విడుదలైంది. జూలై 3 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనున్నది. మొత్తం 57 రోజుల పాటు జరగనున్నది. యాధృచ్ఛికంగా అమర్‌నాథ్ యాత్ర ముగింపు రోజునే రక్షాబంధన్ పర్వదినం కూడా. ఈ యాత్రకు వెళ్ళేవారు ఏప్రిల్ 15 నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ అప్లికేషన్ల రూపంలోనూ కేంద్ర హోం మంత్రిత్వశాఖకు అప్లై చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు (Pilgrims) ఈ యాత్రకు ఆసక్తి చూపుతారన్న ఉద్దేశంతో స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లాంటి కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటవుతాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 554 బ్రాంచీలలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రకు సన్నాహకంగా జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమ శుభ ఘడియల్లో శివుడికి ‘ప్రాథం’ పూజ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్ర చేయాలనుకునేవారికి వయసు నిబంధనలు, హెల్త్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. కనీసంగా 13 ఏండ్ల వయసు దాటి ఉండాలి. 70 ఏండ్ల లోపు వయసు ఉండాలి. ఈ రేంజ్‌లో ఉన్నవారికే అమర్‌నాధ్ యాత్ర (Amarnath Yatra 2026) చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On: X(Twitter)

