కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణలో బీజేపీకి మెజారిటీ సీట్లు సాధించే రేసులో తాను ముందుంటానని.. అదే తన లక్ష్యమని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును కూడా రాజకీయం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ద్వజమెత్తారు. కేంద్రం చేపట్టనున్న మహిళా బిల్లు చారిత్రక ఘట్టం అని చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. దేశంలో ఇంతటి పండగ మరొకటి లేదన్నారు. ఈ బిల్లు ఆమోదంతో చట్ట సభల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళా బిల్లుతో కేవలం మహిళలకే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం లభిస్తుందని వివరించారు.
మహిళా రిజర్వేషన్లతో పారదర్శకత ఉంటుందని చెప్పారు. అవినీతి కూడా తగ్గుతుందన్నారు. మహిళా బిల్లును (Women Reservation Bill) కూడా రాజకీయం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీసీలను అనగదొక్కిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఆనాడు మండల్ కమీషన్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. డాక్టర్ లక్ష్మణ్ తో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో సైతం గ్యాప్ లేదని స్పష్టం చేశారు. రాకేష్ రెడ్డి తన తోబుట్టువుతో సమానమని ఆయన (Dharmapuri Arvind) చెప్పారు.
Read Also: అమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ రిలీజ్
Follow Us On: X(Twitter)

