కలం, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై (ranganath) ఎన్ని రకాల రూమర్లు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేదల ఇండ్లే కూలుస్తాడని కొందరు.. పెద్దవాళ్ల జోలికి పోరని ఇంకొందరు.. రాజకీయాల్లోకి వెళ్తారని మరికొందరు.. ఇలా అంతేలేని రూమర్లు ఆయన మీద ఉన్నాయి. తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కాపు కుల మీటింగులకు వెళ్తే తప్పేం లేదని చెప్పారు. అక్కడకు వెళ్లి చదువుకోవాలి, పైకి రావాలి అనే మంచి మాటలే చెబుతున్నాను తప్ప.. కుల పిచ్చి ఉండాలని చెప్పట్లేదన్నారు.
‘నాకు ఇంకా ఐదేళ్ల సర్వీసు ఉంది. అప్పటి దాకా మంచి పనులు చేస్తూనే ఉంటాను. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిస్తే రాజకీయాల్లోకి వస్తున్నట్టు కాదు. వాళ్లతో నాకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. అందుకే కలిశాను. తప్పు చేస్తే నా కులానికి చెందిన వారి ఇండ్లు అయినా కూల్చేస్తాను. నేను ఏ పార్టీకి అనుకూలంగా పని చేయట్లేదు. రూల్స్ ప్రకారమే వెళ్తాను. అందుకు తగ్గట్టే పనిచేస్తాను’ అని హైడ్రా కమిషనరల్ రంగనాథ్ వెల్లడించారు.

